Tollywood: ఇంటర్‌లోనే లెక్చరర్‌తో ప్రేమలో పడ్డా.. ఇప్పటికీ ఆయనతో.. టాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరీ

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో ఈ హీరోయిన్ కొన్నిబోల్డ్ కామెంట్స్ చేసింది.

Tollywood: ఇంటర్‌లోనే లెక్చరర్‌తో ప్రేమలో పడ్డా.. ఇప్పటికీ ఆయనతో.. టాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరీ
Tollywood Actres Rashi Singh

Updated on: Dec 09, 2025 | 10:02 PM

గతంలో ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్ కు ఈ సిరీస్ తెగ నచ్చేసింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 త్వరోలనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సిరీస్ లో తెలుగమ్మాయిలు ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ డిసెంబర్‌ 12న స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజి బిజీగా ఉంటోంది. హీరోయిన్లు కూడా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రాశీ సింగ్ తన కాలేజ్ డేస్ నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ఏకంగా లెక్చరర్‌తోనే ప్రేమయాణం నడిపినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్చానికి గురి చేసింది.

‘స్కూల్‌ డేస్‌ అయి పోయాక కాలేజీలో చేరాను. ఆ సమయంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మాకు లెక్చరర్ కూడా. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్‌ గా ఉండేవాడు. పరీక్షలు ఉన్నప్పుడు నాకు ముందే ఎగ్జామ్ పేపర్లు కూడా ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. ఇద్దరం సరదాగా కూర్చోని కబుర్లు చెప్పు​కుంటూ టైమ్‌ పాస్‌ చేసేవాళ్లం. ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు.. అతను కూడా చాలా యంగ్‌.. పెళ్లి కూడా కాలేదు. అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన నాతో టచ్ లో ఉన్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. అతని వైఫ్ కూడా ఫాలో అవుతుంది’ అని రాశీ సింగ్‌ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రాశీ సింగ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇదిగో..

హీరోయిన్  రాశీ సింగ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.