
సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు కనిపించరు. భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. అయితేనేం ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే తన కెరీర్ లో నే మొదటి సారి ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా తదితర స్టార్స్ తో కుబేర సినిమాను తెరకెక్కించారు శేఖర్. పైగా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ముందు సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇలా భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 20)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వారందరూ శేఖర్ కమ్ముల టేకింగ్ ను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ధనుష్, నాగార్జున, రష్మిక ల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కుబేర సినిమాను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కుబేర సినిమాను ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ.
కుబేర సినిమాలో ధనుష్ బిక్షగాడి పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే మొదట ఈ పాత్రకు మొదట టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారట. శేఖర్ కమ్ములతో ఉన్న అనుబంధంతో ఈ పాత్రలో విజయ్ కు చాన్స్ ఇచ్చాడట. అయితే ఎందుకో గానీ విజయ్ పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో శేఖర్ కమ్ముల ధనుష్ ను అప్రోచ్ అయ్యారట. అతను వెంటనే ఓకే చెప్పడంతో కుబేర సినిమా పట్టాలెక్కిందట. అయితే విజయ్ దేవర కొండ ఈ సినిమాను చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే విజయ్ కుబేర సినిమాను రిజెక్ట్ చేశాడన్న వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
Every award is first theirs ❤️
Then it is all of yours who carry me along with you..Thank you.
I love you all immensely. pic.twitter.com/7htYpzfU7T— Vijay Deverakonda (@TheDeverakonda) June 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.