Kiran Abbavaram: హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేసిన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం వివాహం.. వీడియో

|

Aug 23, 2024 | 8:44 AM

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గురువారం (ఆగస్టు 22) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram: హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేసిన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం వివాహం.. వీడియో
Kiran Abbavaram Marriage
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గురువారం (ఆగస్టు 22) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు కిరణ్ అబ్బవరం. క‌ర్ణాట‌క కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు సమాచారం. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రహస్య గోరక్ ఎంట్రీ, జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న వీడియో ఇలా కొన్ని వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతకు ముందు గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా జరిగాయి. సంగీత్, హల్దీ, మెహందీ.. ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ కిరణ్, రహస్య.

2019 నవంబర్లో విడుదలైన రాజావారు రాణి గారు సినిమా షూటింగ్ లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు ప్రేమించుకున్నారు. అంతుకు ముందు వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. అయితే నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమాలో ప్రేమికులుగా నటించిన కిరణ్, రహస్య… నిజ జీవితంలోనూ లవర్స్ గా మారారు. అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం, రహస్యల వెడ్డింగ్ వీడియో..

ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారీ లవ్ బర్డ్స్.

రహస్య గోరఖ్  మెడలో మూడు ముళ్లు వేస్తోన్న హీరో కిరణ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.