KTR-Kinnera Mogulaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. నటుడు బ్రహ్మాజీ ఏమన్నాడో తెలుసా?

పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతోన్న ఈ జానపద కళాకారుడు హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ స్థలంలో రోజువారీ కూలీగా పని చేయడం చాలా మందిని కలచి వేసింది

KTR-Kinnera Mogulaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. నటుడు బ్రహ్మాజీ ఏమన్నాడో తెలుసా?
KTR, Brahmaji

Updated on: May 05, 2024 | 6:39 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతోన్న ఈ జానపద కళాకారుడు హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ స్థలంలో రోజువారీ కూలీగా పని చేయడం చాలా మందిని కలచి వేసింది. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం ఇలా కూలీపనులకు వెళ్తున్నట్లు మొగిలయ్య దీనంగా చెప్పుకొచ్చారీ వీడియోలో. నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. మొగిలయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కేటీఆర్. ఆదివారం ఆయన పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిశారు. కళాకారుడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్.. ‘మొగిలయ్యను కలిసి భరోసా కల్పించి నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక గొప్ప జానపద కళాకారుడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన గర్వకారణం’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం కేటీఆర్ మొగిలయ్యను కలిసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా కేటీఆర్ పోస్ట్ పై టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ స్పందించారు.’మొగిల‌య్య‌కు అండగా నిలిచిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మొగిలయ్యకు అండగా నిలిచి కేటీఆర్ నిజ‌మైన నాయ‌కుడు అనిపించుకున్నారు’ అని ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మొగిలయ్యతో మాట్లాడుతోన్న కేటీఆర్..

బ్రహ్మాజీ ట్వీట్..

 

 కూలీ పనులు చేసుకుంటోన్న మొగిలయ్య.. వీడియో


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.