Amardeep, Supritha: “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి”గా అమర్ దీప్, సుప్రీత.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
సీరియల్స్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. సీరియల్స్ ఫాలో అయ్యే ప్రేక్షకుల్లో అమర్ దీప్ కు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ షోతో అమర్ దీప్‌కు మంచి క్రేజ్ వచ్చింది. విన్నర్‌గా నిలవాల్సిన అమర్ దీప్.. చివరకు రన్నర్ గా బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందే ఓ స్క్రిప్ట్‌ను ఓకే చేసేశాడు. ఆ సినిమాలో సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా చేస్తుంది.

ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి, నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఓ ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు “చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేస్తూ..
హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ “సినిమా స్టార్టింగ్ టైం లో నాకు భయం వేసింది కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మా డైరెక్టర్ కి థాంక్స్ మా హీరో అమరదీప్ కి థాంక్స్, షూటింగ్ టైం లో చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాము. విజువల్స్ చాలా బాగున్నాయి” అని తెలిపారు
హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది, నా మొదటి సినిమా కి ఇంత మంచి టైటిల్ లో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జర్నీ లో మహేంద్ర గారు లాంటి మంచి ప్రొడ్యూసర్ ని నేను ఎక్కడ చూడలేదు. సినిమా ని నమ్మితే ఎంత ఆయన ఖర్చు పెడతారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమా తో రావాలని అనుకున్నాను, అని కుదరడానికి ఇంత సమయం పట్టింది. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
అలాగే నటి సురేఖ వాణి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది. మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. సినిమా చాలా బాగా రావాలి సూపర్ హిట్ కావాలి” అని కోరుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
