Tina Shilparaj: టాలీవుడ్‌కు మరో తెలుగమ్మాయి.. చిన్న సినిమాతో పరిచయం అవుతోన్న క్యూట్ బ్యూటీ టీనా శిల్పరాజ్

నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకుముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీకి మేము కలసి పని చేశాం. రైటర్ పద్మభూషణ్‌ కి ఆడిషన్స్ ఇచ్చాను.

Tina Shilparaj: టాలీవుడ్‌కు మరో తెలుగమ్మాయి.. చిన్న సినిమాతో పరిచయం అవుతోన్న క్యూట్ బ్యూటీ టీనా శిల్పరాజ్
Tina Shilpa Raj
Follow us

|

Updated on: Jan 31, 2023 | 8:34 AM

టాలీవుడ్ కు కొత్త అందాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తోన్న ముద్దుగుమ్మలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది టాలీవుడ్ లోకి అడుగులు వేయగా.. ఇప్పుడు మరో భామ కూడాఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.. ఆ భామ పేరే టీనా శిల్పరాజ్. ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ టీనా శిల్పరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ.. నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకుముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీకి మేము కలసి పని చేశాం. రైటర్ పద్మభూషణ్‌ కి ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగింది. ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మాను. నేను నమ్మినట్లే సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. చాలా కామెడీ వుంటుంది, హ్యాపీ ఎమోషన్స్ వుంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు.

రైటర్ పద్మభూషణ్‌ లో నా పాత్ర పేరు సారిక. సారిక విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్రది. దర్శకుడు ప్రశాంత్ సారిక పాత్రని చాలా అద్భుతంగా రాసుకున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుంది. రైటర్ పద్మభూషణ్‌ ప్రిమియర్స్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడ ప్రిమియర్ కి వచ్చిన స్పందన చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. థియేటర్ నిండిపోయింది. మేము స్టేజ్ పై నిలబడి చూశాం. ప్రేక్షకులంతా సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అయ్యారు. గుంటూరు, భీమవరంలో కూడా ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించింది.

సుహాస్ అద్భుతమైన ప్రతిభ గల నటుడు. ‘కలర్ ఫోటో’ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సుహాస్ సినిమాతో పరిచయం కావడం నాకు చాలా స్పెషల్.  రైటర్ పద్మభూషణ్‌ గ్రేట్ జర్నీ. ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా గురించి అవగాహన వుంది. అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం.. ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి ? ఇలా చాలా విషయాలు రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణంలో నేర్చుకున్నాను.

కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్