Trending Song: ఏం సాంగ్ భయ్యా.. 25 ఏళ్ల కిందట తరుణ్ అదరగొట్టాడు.. ఇప్పటికీ కుర్రాళ్ల ఫెవరేట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోలలో తరుణ్ ఒకరు. ఎన్నో ప్రేమ కథ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్ అభిమానించే హీరో అన్న సంగతి తెలిసిందే. అయితే తరుణ్ నటించిన ఓ సాంగ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

Trending Song: ఏం సాంగ్ భయ్యా.. 25 ఏళ్ల కిందట తరుణ్ అదరగొట్టాడు.. ఇప్పటికీ కుర్రాళ్ల  ఫెవరేట్..
Trending Song

Updated on: Jan 29, 2026 | 7:30 PM

సాధారణంగా కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతతను కలిగించే పాటల గురించి చెప్పక్కర్లేదు. మెలోడీ పాటలకు ఉండే వైబ్ వేరేలెవల్. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా పాటలు ట్రెండింగ్ అవుతున్నాయి. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్.. దాదాపు 25 సంవత్సరాలుగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలి కోసం పాడుకుంటాడు. అప్పట్లో తరుణ్ నటించిన ఈ సాంగ్.. ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. శ్రోతల హృదయాల్లో రెండు దశాబ్దాలుగా నిలిచిన పాట నిద్దురపోతున్న రాతిని అడిగా సాంగ్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..

టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ నటించిన చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అప్పట్లో ప్రేమకథ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే ఒకటి. ఈ చిత్రంలోని నిద్దురపోతున్న రాతిరిని అడిగా.. సాంగ్. ప్రియురాలి జాడ కోసం వెతికేపనిలో పడ్డ తరుణ్.. తన స్నేహితుడు సునీల్ తో కలిసి పాడుకున్న పాటే ఇది. దాదాపు 25 ఏళ్ల నుంచి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

నువ్వే నువ్వే సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో తరుణ్ సరసన శ్రియ కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, సునీల్, చంద్రమోహన్ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ కాగా.. సాంగ్స్ సైతం భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మీకు నచ్చిన ఈ సాంగ్ మరోసారి వినేయండి..

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..