Cinema: 150 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.67 కోట్లు రాలేదు.. థియేటర్లలో పెద్ద డిజాస్టర్.. ఇప్పుడు ఓటీటీలోకి..
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కేవలం రూ.67 కోట్లు రాబట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాదిలోనే అతిపెద్ద పరాజయం చూసింది ఈ చిత్రం.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. స్టార్ హీరోహీరోయిన్స్ నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ అంతగా మెప్పించలేదు. దాదాపు 150 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.67 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన సన్ ఆఫ్ సర్దార్ 2. 2012లో విడుదలైన సన్ ఆఫ్ సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రవి కిషన్, నీరు బజ్వా, సంజయ్ మిశ్రా నటించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
రూ. 150 కోట్ల నిర్మాణ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. థియేటర్లలో విడుదలయ్యే సమయానికి, దాదాపు రూ. 67 కోట్లు వసూలు చేసి, పెట్టుబడిలో సగం కంటే తక్కువ మొత్తాన్ని రాబట్టింది. పేలవమైన స్క్రిప్ట్, రోటిన్ కామెడీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మరోవైపు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ 26 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. గృహ నిర్బంధం నుండి బయటపడి, సంవత్సరాల విరామం తర్వాత, తన భార్యను తిరిగి కలవడానికి స్కాట్లాండ్‌కు వెళ్లే జస్సీ సింగ్ రంధావా చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఆగస్టు 1, 2025న థియేటర్లలో విడుదలైంది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..








