Aha OTT: ‘ఆహా’లో రాబోతున్న థ్రిల్లింగ్ మూవీస్.. ప్రేక్షకులకు ఆకట్టుకోనున్న సినిమాల లిస్ట్ ఇదే..

ఒకవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో.. మరోవైపు అనువాద చిత్రాలతో ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతోంది...

Aha OTT: ఆహాలో రాబోతున్న థ్రిల్లింగ్ మూవీస్.. ప్రేక్షకులకు ఆకట్టుకోనున్న సినిమాల లిస్ట్ ఇదే..
Aha Ott

Updated on: Jun 01, 2021 | 4:59 PM

ఒకవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో.. మరోవైపు అనువాద చిత్రాలతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతోంది. ఇప్పటికే ‘సుల్తాన్’, ‘చావు కబురు చల్లగా’, ‘జాంబీ రెడ్డి’, ‘నాంది’, ‘థాంక్యూ బ్రదర్’, ‘అనుకోని అతిధి’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌లను అందించిన ‘ఆహా’.. జూన్ నెలలో సైతం డిఫరెంట్ సినిమాలను విడుదల చేసేందుకు సిద్దమైంది. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం..

‘కాలా’.. టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళం హిట్ మూవీ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. అలాగే కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్ధ శతాబ్దం’ మూవీ జూన్ 11 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ జూన్ 18న ఆహాలో ప్రసారం అవుతుంది. దీనిని విద్యాసాగర్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ నందిని రాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘వన్‌’ చిత్రం జూన్ 25 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!