
ప్రఖ్యాత టెలివిజన్ రైటర్, ఎంతో ప్రసిద్దిగాంచిన ఫ్యామిలీ డ్రామా “దిస్ ఈజ్ యూఎస్” రచయిత్రి జాస్ వాటర్స్ 39 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె మరణ వార్తను “దిస్ ఈజ్ యూఎస్” రచయితలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం ధృవీకరించారు. జాస్ వాటర్స్ ఎలా మరణించిందో తెలిసి ఆమె సహచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గురువారం ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్-కరోనర్ కార్యాలయం తెలిపింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాకపోతే జాస్ వాటర్స్ చివరిసారిగా వేసిన ట్వీట్ లో తన జీవితంలో ఏదో మిస్ అయ్యాయన్న బాధను వ్యక్తపరిచింది. ‘దిస్ ఈజ్ యూఎస్’ యొక్క 18 ఎపిసోడ్లు రాసినందుకు వాటర్స్ బాగా ప్రసిద్ది చెందారు. జిమ్ కారీ యొక్క ‘కిడ్డింగ్’ లో స్టోరీ ఎడిటర్‌గా ఆమె చివరిసారిగా పనిచేశారు.
The entire #ThisIsUs family was devastated to learn of Jas Waters passing. In our time together, Jas left her mark on us and ALL over the show. She was a brilliant storyteller and a force of nature. We send our deepest sympathies to her loved ones. She was one of us. RIP @JasFly. pic.twitter.com/cmrh2OO8of
— ThisIsUsWriters (@ThisIsUsWriters) June 10, 2020