
ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంటే కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్నాయి. హారర్, సస్పెన్స్ సిరీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హారర్ సిరీస్ ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఉత్కంఠ, థ్రిల్ అందిస్తుంది. హారర్ సినిమాలకు మీరు అభిమాని అయితే ఈ సిరీస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ సిరీస్ పేరు ఐంధం వేదం. హీరో విశాల్ కు కాబోయే భార్య సాయి ధన్సిఖ ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో విడుదలైన ఈ సిరీస్ కు రోజు రోజుకు మరింత రెస్పాన్స్ వస్తుంది. బలమైన కథ, అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పౌరాణిక-సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ‘ఐంధం వేదం’ అను అనే అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. అను తన తల్లి అంత్యక్రియల కోసం వారణాసికి వెళ్తుంది. అక్కడే ఒక రహస్య వ్యక్తిని కలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈ సిరీస్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ లోని రెండు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. ప్రతి ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల వరకు నిడివి ఉంటుంది. అలాగే IMDBలో 7.2 రేటింగ్‌ను పొందింది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
ఈ సిరీస్ కు నాగ దర్శకత్వం వహించారు. ఇందులో సంతోష ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై. జీ మహేంద్రన్, కృష్ణ కురుప్, రామ్ జీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వానన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతి నటుడు తన పాత్రను అద్భుతంగా పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..