నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

|

Jan 16, 2025 | 4:04 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కుర్రహీరోలు, బడా హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే.. కుర్ర హీరోలు చిన్న సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. పైన కనిపిస్తున్న హీరో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Tollywood Hero
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బడా హీరోలు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కుర్ర హీరోలు చిన్న సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేస్తుంటున్నారు. ఆ లిస్ట్ లో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. సోలో హీరోగా హిట్ కొట్టలేక.. సెకండ్ హీరోగా మారాడు. అంతే కాదు ఒకటి రెండు సినిమాల్లో విలన్ గాను నటించి మెప్పించాడు. కాగా ఈ యంగ్ హీరో రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడట.. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్లుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కుర్ర హీరో సందీప్ కిషన్. స్నేహగీతం సినిమాతో పరిచయమైనా ఈ యంగ్ హీరో.. ఆతర్వాత ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో సందీప్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ఆతర్వాత రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలతో హీరోగా మెప్పించాడు. ఈ రెండు సినిమాల తర్వాత హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సందీప్ సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. కానీ ఈ కుర్ర హీరోకు సరైన బ్రేక్ రాలేదు. గత ఏడాది సందీప్ నటించిన ఊరుపేరు భైరవకోన సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో హీరో తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మజాకా అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ సినిమా టీజర్‌ ను కూడా రీసెంట్ గానే విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. త్రినాద్ రావు నక్కిన తో సినిమా చేయాలనీ ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ కుదరలేదు. నాని నేను లోకల్ సినిమా, రామ్ పోతినేని హలో గురు ప్రేమకోసమే సినిమాలు చేను చేయాల్సినవి కానీ లాస్ట్ మినిట్ లో షిఫ్ట్ అయ్యాయి,. ఇప్పటికీ ఆయన దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు సందీప్.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి