అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

మాస్ మాహారాజా రవితేజకు ఇప్పుడు సాలిడ్ సక్సెస్ అవసరం. చిన్న హీరోలు, స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే రవితేజ సక్సెస్ కోసం సతమతం అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మెగాస్టార్ ఖాతలోకి వెళ్ళిపోయింది. అసలు రవితేజ సినిమాలకు ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.

అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..
Raviteja

Updated on: Jun 20, 2025 | 12:13 PM

మాస్ రాజా రవితేజ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒక్క సినిమా హిట్ పడితే .. నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఇదిలా ఉంటే రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. చాలా మంది స్టార్స్ గా మారక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోలుగా మారారు.

అలాగే రవితేజ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసిన ఓ కుర్రాడు .. ఆతరువాత హీరోగా మారాడు. అంతే కాదు ఏ స్టార్ హీరో సినిమాలో అయితే సైడ్ క్యారెక్టర్ చేశాడో అదే హీరో సినిమాలో ఏకంగా గెస్ట్ రోల్ లో కనిపించాడు.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే.. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో ఈ పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో సిద్దూ చిన్న పాత్రలు చేశాడు.. ఆతర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్దూ.. టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉంటే రవితేజ హీరోగా నటించినడాన్ శీను సినిమాలో సిద్దూ జొన్నల గడ్డ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో అతను చిన్న సీన్ లో అలా కనిపించి ఇలా వెళ్ళిపోతాడు. ఆతర్వాత రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఏకంగా గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ లో సిద్దూ కనిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు రవితేజతో పాటు సిద్దూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే తెలుసు కదా అనే సినిమాతో రానున్నాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.