OTT Platform: థియేటర్స్లో బొమ్మ పడి చాలాకాలం అయ్యింది. ఇటీవలే థియటర్స్ తాళాలు తెరుచుకున్న జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెద్ద సినిమాలు సందడి చేస్తే తప్ప థియేటర్స్ కు పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమలో థియేటర్స్లో విడుదలైన చిన్న సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమా ఓటీటీ లో పోటీపడి స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిజిటల్ స్క్రీన్స్ కూడా చిన్న హీరోల మధ్య పెద్ద పోటీయే పెట్టేసింది. మూడు డిఫరెంట్ జానర్స్‌తో రిలీజైన మూడు సినిమాలు.. ఓటీటీ ఆడియన్స్‌ని ఫిదా చెయ్యడంలో పోటీపడుతున్నాయి. థియేటర్లలో డీసెంట్ హిట్ అనిపించుకున్న తిమ్మరుసు నెలరోజులు తిరక్కముందే ఓటీటీ వ్యూయర్స్‌కి అందుబాటులోకి వచ్చేసింది. యాంగ్రీ అడ్వొకేట్‌గా సత్యదేవ్ పెర్ఫామెన్స్.. డిజి ఆడియన్స్‌ని కూడా ఎట్రాక్ట్ చేసింది. అటు.. తండ్రీకొడుకుల కథగా, మిడిల్ క్లాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఎస్ ఆర్ కల్యాణ మండపం కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటుంది.
హీరోగా కిరణ్ అబ్బవరం… లుక్స్ పరంగా ‘బాయ్ నెక్ట్స్ డోర్’ అనిపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రిలేటెడ్ కథలకు డిజిటల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ వుంటుందని ప్రూవ్ చేసింది ఎస్‌ఆర్ కల్యామండపం. షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగాడు కిరణ్. మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ సినిమాతో మంచి హిట్ను అందుకున్న కిరణ్ ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే కమెడియన్ సత్య హీరోగా ట్రై చేసిన వివాహ భోజనంబు కూడా సోనీ లివ్ యాప్‌లో వచ్చేసింది. సందీప్ కిషన్, సినీష్ సమర్పించిన వివాహ భోజనంబు… కంప్లీట్ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్‌తో కంటిన్యూ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :