Theater-OTT Movies:- ఈ వారం మరింత వినోదం.. థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..

|

May 09, 2022 | 12:04 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న థియేటర్లలో విడుదల కాబోతుంది.

Theater-OTT Movies:- ఈ వారం మరింత వినోదం.. థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..
Movies
Follow us on

వేసవిలో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది..గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఓవైపు పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతుండగా.. మరోవైపు.. చిన్న సినిమాల సందడి నడుస్తోంది. పుష్ప, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్ల సునామీ సృష్టించగా.. చిన్న సినిమాలు వినోదాన్ని అందించాయి. ఇక మే రెండో వారం సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి పలు చిత్రాలు. మరీ ఈ వారం థియేటర్లు.. ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలెంటో తెలుసుకుందామా…

సర్కారు వారి పాట..
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలీష్.. హ్యాండ్సమ్ లుక్కులో కనిపించనున్నాడు.. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మే 7న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

జయేశ్ భాయ్ జోర్దార్..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రణవీర్ భర్యగా షాలిని పాండే నటించగా.. బొమన్ ఇరానీ, రత్నపాఠక్ షా కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. భ్రూణహత్యల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఆడపిల్ల తండ్రిగా రణవీర్ కనిపించనున్నాడు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..
ది కశ్మీర్ ఫైల్స్..
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది ది కశ్మీర్ ఫైల్స్. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అతంత్య ప్రజాధరణ పొందిన ఈ మూవీ మే 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, కీలకపాత్రలలో నటించారు.

బీస్ట్..
తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి.. పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. ఈ సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించగా.. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రా.. ఏజెంట్ పాత్రలో నటించారు విజయ్. ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులోని సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మే 11న స్ట్రీమింగ్ కానుంది.

జీ5..
తాలెదండ.. కన్నడ.. మే 13.
ముగిలిపేట్.. కన్నడ.. మే 13.

అమెజాన్ ప్రైమ్..
మోడర్న్ లవ్ ముంబై.. హిందీ సిరీస్.. మే 13
ది మాట్రిక్స్ రెసరెక్షన్స్.. తెలుగు… మే 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
స్నీకరెల్లా.. హాలీవుడ్.. మే 13

ఆహా..
కుతుకు పత్తు.. తమిళం.. మే 13

నెట్ ఫ్లిక్స్..
సేవేజ్ బ్యూటీ.. మే 13

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?