జూన్ నెలలో థియేటర్ల వినోదాల జాతర కొనసాగుతుంది. నెల ప్రారంభం నుంచే ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన మేజర్, విక్రమ్ సినిమాలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. జూన్ రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించే సినిమాలు ఎంటో తెలుసుకుందామా.
అంటే సుందరానికీ..
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని..మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ జంటగా నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జూన్ 10న విడుదల కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమాతో నజ్రీయా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇందులో నాని బ్రహ్మిణ్ అబ్బాయి అయిన సుందర్ పాత్రలో.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ప్రేమకు ఇరువురి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది తెలుసుకోవాలంటే అంటే సుందరానికీ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
చార్లీ 777
కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం చార్లీ 777. కిరిక్ పార్టీ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన రక్షిత్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.. డైరెక్టర్ కిరణ్ రాజ్ కె దర్శకత్వంలో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భావోద్వేగాల ప్రయాణం.. ఎవరు లేని ఒంటరి వ్యక్తికి అనుకోకుండా తారసపడిన ఓ కుక్క ధర్మ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది ? అనేది చార్లీ 777. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా ఉంది… ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జురాసిక్ వరల్డ్..
జురాసిక్ పార్క్.. ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలకు పెద్దలు, చిన్న అందరూ అభిమానులు.. ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు జురాసిక్ వరల్డ్ డొమినియన్ పేరుతో మరో కొత్త చిత్రం రాబోతుంది. ఈ సిరీస్ ఇంగ్లీష్ లోనే కాకుండా భారతీయ భాషల్లోనూ జూన్ 10న విడుదల చేయనున్నారు.
ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు..
డాన్..
తమిళ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాలేజ్ డాన్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. మే 13న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా జూన్ 10న స్ట్రీమింగ్ కానుంది.
అలాగే బేబీ ఫీవర్ వెబ్ సిరీస్ జూన్ 8 నుంచి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుండగా.. హసెల్ హాలీవుడ్ సిరీస్ జూన్ 8న, ఫస్ట్ కిల్ వెబ్ సిరీస్ జూన్ 10న, ఇంటిమసీ స్పానిష్ సిరీస్ జూన్ 10న స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5లో అర్థ్ హిందీ సిరీస్ జూన్ 10న, ద బ్రోకెన్ న్యూస్ హిందీ సిరీస్ జూన్ 10న స్ట్రీమింగ్ కానున్నాయి.
అలాగే ఉడాన్ పటోలాస్ అనే హిందీ వెబ్ సిరీస్ జూన్ 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇన్నలే వార్ మలయాళం సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీ లివ్ లో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.