Tollywood Movies: ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా..

|

Feb 20, 2024 | 7:39 AM

గతవారం సస్పె్న్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ వారం కూడా మరింత కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

Tollywood Movies: ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా..
Tollywood Movies
Follow us on

గతవారం సస్పె్న్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ వారం కూడా మరింత కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. మరీ ఫిబ్రవరి మూడవ వారం థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేసేందుకు ఏఏ సినిమాలు రెడీగా ఉన్నాయో తెలుసుకుందామా.

సుందరం మాస్టర్..
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష చెముడు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయికగా నటించగా.. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది.

మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా..
అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా.. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు.

సిద్ధార్థ్ రాయ్..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు దీపక్ సరోజ్. ఇప్పుడు ఆయన హీరోగా రాబోతున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. యశస్వి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తన్వి నేగి కథానాయికగా నటిస్తుంది. కొత్తతరం ప్రేమకథతో రూపొందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 23న అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

ముఖ్య గమనిక..
వేణు మురళీ ధర్ తెరకెక్కించిన సినిమా ముఖ్య గమనిక. ఇందులో విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వ్సతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు.

సైరన్..
జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందించిన సినిమా సైరన్. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఆర్టికల్ 370. ఆదిత్య సుహాస్ తెరకెక్కించిన ఈ సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు.

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..

అవతార్.. ది లాస్ట్ ఎయిర్ బెండర్.. హాలీవుడ్ సినిమా.. ఫిబ్రవరి 22

బరీడ్ ట్రూత్.. హిందీ సినిమా.. ఫిబ్రవరి 23

అమెజాన్ ప్రైమ్ వీడియో..

అపార్ట్మెంట్ 404.. కొరియన్ సిరీస్.. ఫిబ్రవరి 23

పోచర్.. తెలుగు డబ్బింగ్.. ఫిబ్రవరి 23

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

విల్ ట్రెంట్.. వెబ్ సిరీస్.. ఫిబ్రవరి 21

మలైకోట్టై వాలిబన్.. మలయాళం.. ఫిబ్రవరి 23