Bappi Lahiri Telugu Songs: బప్పి లహిరి టాప్ సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ ఇవే..

|

Feb 16, 2022 | 11:36 AM

డిస్కో మ్యూజిక్ కింగ్.. సంగీత దర్శకుడు బప్పీ లహరి (Bappi Lahiri) బుధవారం ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని  బ్రీచ్ కాండీ

Bappi Lahiri Telugu Songs: బప్పి లహిరి టాప్ సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ ఇవే..
Follow us on

డిస్కో మ్యూజిక్ కింగ్.. సంగీత దర్శకుడు బప్పీ లహరి (Bappi Lahiri) బుధవారం ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని  బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 69 ఏళ్ల బప్పీ లహిరి బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. బప్పీ డాగా పేరుగాంచిన సంగీతం దర్శకుడు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతి చిత్రాలకు సంగీతం అందించారు.

1952, నవంబర్ 27న పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలోని శాస్త్రీయ సంగీతం నేర్పించే సంప్రదాయ కుటుంబంలో బప్పీ జన్మించారు. బప్పీ అసలు పేరు అలోకేష్ లహిరి. తండ్రి.. అపరేష్ లహరి ప్రసిద్ధ బెంగాలీ గాయకుడు, తల్లి, బన్సారి లహరి సంగీత విద్వాంసురాలు. 19ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా వృత్తిని చేపట్టిన బప్పీలహరి, 2018లో జరిగిన 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బప్పీలహరి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అందుకున్నారు. హిందీలో చివరిసారిగా 2020లో బాగీ-3 లోని పాటకు సంగీతమందించగా.. తెరపై చివరిసారిగా సల్మాన్ ఖాన్ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో కనిపించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు నటుల సినిమాలకు సంగీతం అందించారు.

1986లో సూపర్ స్టార్ కృష్మ నటించిన సింహాసనం చిత్రానికి బప్పీ లహిరి సంగీతం అందించారు. ఇందులో ఆకాశంలో ఒక తార పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి, రాధ, భాను ప్రియ ప్రధానపాత్రలలో నటించిన స్టేట్ రౌడీ చిత్రానికి బప్పీ లహిరి సంగీతం అందించారు. ఇందులో రాధా రాధా సాంగ్, చుక్కల పల్లకిలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్.

అలాగే చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి కూడా పనిచేశారు. ఈ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ హిట్.

ఇక మెగాస్టార్ చిరంజీవి, దివ్యభారతి కాంబోలో వచ్చిన రౌడీ అల్లుడు చిత్రానికి బప్పీ సంగీతం అందించారు. ఇందులోని చిలుకా క్షేమమా.. పాట ఇప్పటికీ శ్రోతలను మంత్రముగ్దులను చేస్తోంది.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు, శోభన నటించిన రౌడీ గారి పెళ్లాం సినిమాతో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఇందులో బోయవాని వేటకు గాయపడిన కోయిలా పాట ఇప్పటికీ సూపర్ హిట్.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!