
బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా బిగ్ బాస్ సీజన్ 9ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. అయితే ఈసారి సెలబ్రటీలతో సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్షను మొదలు పెట్టారు. ఈ అగ్నిపరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నవారిని తీసుకొచ్చారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు.
అలాగే ఈ అగ్నిపరీక్షకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది. తాజాగా విడుదల చేసిన ప్రేమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్షద్వారా వారిలో 15మందిని సెలక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లనున్న 15మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ 15మందిలో ఇప్పుడు ఓ ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనూష రత్నం.. ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్. నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని తెలుస్తుంది. ఈ చిన్నదానితో పాటు మరో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కూడా బిగ్ బాస్ లో సందడి చేయనుందని తెలుస్తుంది. దమ్ము శ్రీజ.. ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా తన ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మిస్ తెలంగాణ రన్నరప్ గా నిలిచిన కల్కి. ఈ భామ అందానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ముగ్గురు భామలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి