AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2024: ఆస్కార్ రేసులో 12 భారతీయ సినిమాలు.. తెలుగులో ఏ సినిమా అంటే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు. అందులో అత్యధికంగా ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న నటుడు రఘుబీర్ యాదవ్. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతను.. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఆస్కార్ రేసులో ఎంపికయ్యారు.

Oscars 2024: ఆస్కార్ రేసులో 12 భారతీయ సినిమాలు.. తెలుగులో ఏ సినిమా అంటే..
Oscars 2024
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2024 | 10:00 AM

Share

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి. తమ సినీ ప్రయాణంలో ఒక్కసారైన ఈ అవార్డ్ అందుకోవాలని నటీనటులు, దర్శకనిర్మాతలు కలలు కంటారు. నామినేషన్లలో అర్హత సాధించినా గొప్ప విషయంగానే భావిస్తారు. ఈ పురస్కారాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు. అందులో అత్యధికంగా ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న నటుడు రఘుబీర్ యాదవ్. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతను.. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఆస్కార్ రేసులో ఎంపికయ్యారు. ఇక గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, రచయిత సుభాష్ చంద్రభోస్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఈ పురస్కారాలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ 2024కి భారతదేశం నుంచి పలు చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన (ఎఫ్ఎఫ్ఐ) వివిధ భాషలు, జానర్స్ నుంచి 22కి పైగా ఎంట్రీలను అందుకుంది. చిత్రనిర్మాత గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల జ్యూరీ వాటిని చెన్నైలో సమీక్షిస్తోంది. తుది ఎంపికపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈసారి ఆస్కార్ అవార్డ్ కోసం పంపబడిన చిత్రాలలో మొత్తం 12 సినిమాలు ఇప్పుడు చుద్దాం.

  1. ది స్టోరీటెల్లర్ (హిందీ)
  2. సంగీత పాఠశాల (హిందీ)
  3. శ్రీమతి ఛటర్జీ vs నార్వే (హిందీ)
  4. డంకీ (హిందీ)
  5. 12th ఫెయిల్ (హిందీ)
  6. విడుతలై పార్ట్ 1 (తమిళం)
  7. ఘూమర్ (హిందీ)
  8. దసరా (తెలుగు).
  9. జ్విగాటో (హిందీ)
  10. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
  11. కేరళ కథ (హిందీ).
  12. 2018 (మలయాళం), మరిన్ని..

ఇదే జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్ 2 (హిందీ), అబ్ తో సబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లియోక్ (మరాఠీ) వంటి చిత్రాలు ఉండే అవకాశం లేకపోలేదు. గతంలో 1957 ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే! (1988), లగాన్ (2001) చిత్రాలు మాత్రమే నామినేట్ అయ్యాయి.