Ugadi Movies: ఉగాదికి విడుదల కాబోతున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగే ఇక..

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22న థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

Ugadi Movies: ఉగాదికి విడుదల కాబోతున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగే ఇక..
Ugadi Movies

Updated on: Mar 19, 2023 | 9:41 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల హావా నడుస్తోంది. ఇప్పుడేలాంటి పెద్దసినిమాలు రిలీజ్ కాకపోవడంతో.. చిన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ మెయిన్‏గా ఉన్న చిత్రాలకు సినీ ప్రియులు క్యూ కడుతున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఉగాది రాబోతుంది. ఉగాది అనగానే కొత్త ఏడాది మొదలు అనే సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుంది. అందుకే ఈ రోజున తమ సినిమాలకు సంబంధించిన అనేక పోస్టర్స్, టీజర్స్ విడుదల చేస్తుంటారు. ఇక ఈ పండగ రోజుల థియేటర్లలో సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22న థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఉగాది రోజున విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆసక్తిని పెంచాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వియ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కువ బజ్ నెలకొంది. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే…. ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటించిన గీత సాక్షిగా చిత్రం కూడా విడుదల కానుంది. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది. ఇవే కాకుండా.. కాజల్ నటించిన కోస్టి సినిమా సైతం అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో ఉగాదికి ఇక థియేటర్లలో సినీ పండగ ఉండబోతుంది.