Kiran Abbavaram: అభిమాన హీరో చేతులమీదుగా ట్రైలర్ రిలీజ్.. ఆనందంలో తేలిపోతున్న యంగ్ హీరో
యంగ్ కిరణ్ అబ్బవరం మొదటి నుంచి కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. కేరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన కిరణ్.. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మారాడు.
యంగ్ కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మొదటి నుంచి కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. కేరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన కిరణ్.. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా సమ్మతమే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు కిరణ్. ఇక ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం. ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకులే ఉందంటూ పవన్ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. తన అభిమాన హీరో తన సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో కిరణ్ ఆనందంలో తేలిపోతున్నాడు. రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్ధమవుతుంది. కిరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా, ఈ నెల 16న విడుదల కానుంది. మరి ఈ సినిమా కిరణ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.