Allari Naresh :కొత్త సినిమా మొదలుపెట్టిన అల్లరోడు.. ఉగ్రరూపం చూపించిన నరేష్..

హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్. తనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు రుచిచూపించారు.

Allari Naresh :కొత్త సినిమా మొదలుపెట్టిన అల్లరోడు..  ఉగ్రరూపం చూపించిన నరేష్..
Allari Naresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2022 | 10:10 PM

హీరో అల్లరి నరేష్(Allari Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్. తనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు రుచిచూపించారు. నేను సినిమాతో పాటు రీసెంట్ గా వచ్చిన నాంది లాంటి విభిన్నమైన సినిమాలను చేసి అబ్బురపరిచారు. దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

తాజాగా రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను అందజేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రానికి ‘ఉగ్రం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆవేశంతో అరుస్తుండగా, అతని వెనుక భాగంలో కత్తిపోటు, శరీరమంతా గాయాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ‘ఉగ్రం’ టైటిల్‌ కు సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. టైటిల్ ని రెడ్ కలర్‌తో డిజైన్ చేయడం ఇంట్రస్టింగా వుంది. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెసెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే