AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Elephant Whisperers: బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’

కార్తికీ గాన్‌స్లేవ్స్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ గునీత్‌ మోంగా ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. లాస్‌ఏంజెలిస్‌లో ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు గునీత్‌ మోంగా.

The Elephant Whisperers: బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అందుకున్న 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'
The Elephant Whisperers
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2023 | 9:22 PM

Share

ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు రాకతో మీసం మేలేసింది టాలీవుడ్. 95వ అకాడమీ అవార్డుల్లో భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు కూడా ఆస్కార్‌ దక్కింది. తమిళంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ గెలుచుకుంది. కార్తికీ గాన్‌స్లేవ్స్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ గునీత్‌ మోంగా ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. లాస్‌ఏంజెలిస్‌లో ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు గునీత్‌ మోంగా. 2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్ కి ఆస్కార్‌ అందుకున్నారు. అప్పుడు అమెరికా నుంచి డాక్యుమెంటరీని ప్రొడ్యూస్‌ చేసిన వారిలో ఆమె కూడా ఉన్నారు.

ఏనుగు చిన్నప్పటి నుంచి అది పెరిగి పెద్దయ్యేంత వరకు జీవన విధానాన్ని చూపించిన డాక్యుమెంటరీ ఇది. దీనికి ఇంటర్నేషనల్ వేదికగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆస్కార్‌కు కూడా నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. ఓ డాక్యుమెంటరీని ఐదేళ్ల పాటు తెరకెక్కించడం ఏంటనే విషయాన్ని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు జనాలు. వన్యమృగాలు మనకు చేటు చేయవని, వాటి జీవనశైలికి తగ్గట్టు వాటిని వదిలేయాలని చెప్పిన డాక్యుమెంటరీ ఇది. వాటితో స్నేహం చేస్తే కుటుంబంలో ఒకరిలా కలిసిపోతాయని చూపించింది. ముదుమలై ఫారెస్ట్ లో తెరకెక్కి ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ ఏనుగులు విధ్వంసం చేస్తాయనే కాన్సెప్ట్ తప్పు అని చెప్పింది.

కూతురిని పోగొట్టుకున్న ఓ తల్లి రఘు అనే ఏనుగును కన్నబిడ్డగా పెంచిన విధానాన్ని డాక్యుమెంటరీలో కళ్లకు కట్టారు. ఆ ఏనుగు సంరక్షణ బాధ్యత కోసం కలిసిన మహిళ, పురుషుడు… మనసులు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఏనుగు కలిపిన ఫ్యామిలీగా ఎమోషనల్‌గా సాగుతుంది కంటెంట్‌. 1929లో ఆస్కార్ అవార్డు మొదలైనప్పటి నుంచి మన భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి. పైగా ఈసారి ఆస్కార్ నామినేషన్‌లో అందరూ ఆర్ఆర్ఆర్ వైపు ఆసక్తిగా చూస్తుండగా.. మరో రెండు నామినేషన్స్‌కు వచ్చి అందరిని గర్వంతో ఉప్పొంగేలా చేశాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో   రేసులో నిలిచింది.