Samantha: సమంత, నాగచైతన్యల విడాకుల అంశం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ జంట వీడిపోవడానికి సమంతనే కారణమంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఈ వివాదం చల్లబడుతుందని అనుకుంటున్న సమయంలో సమంత కోర్టు మెట్లెక్కెసరికి మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ రెండు యూట్యూబ్ చానెళ్లతోపాటు డాక్టర్ వెంకట్ రావుపై సమంత కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. అబద్దాలను ప్రచారం చేసిన సదరు వ్యక్తులు, చానెళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా సమంత తన పిటిషన్ లో కోరింది. దీంతో కూకట్ పల్లి కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది.
ఇక ఈ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. తాజాగా సమంత తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు కేసును వచ్చే సోమవారంకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విషయమై మరోసారి వాదనలు వింటామని చెప్పిన కూకట్‌పల్లి కోర్టు.. పూర్తి వాదనలు విన్న తర్వాతే తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే విచారణను అక్టోబర్ 25కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే గురువారం సమంత దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న ఆమె తరఫు న్యాయవాదిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కోర్టులో, చట్టం ముందు అందరూ సమానులే. కొందరు ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనే భావన ఉండదు. మీ కేసును ప్రొసీజర్ ప్రకారమే విచారిస్తాం. మిగతా పరువునష్టం కేసుల మాదిరిగానే వాదనలు వింటాం. దీనిని అత్యవసర కేసుగా టేకప్ చేయబోమ’ని జడ్జ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read: Jai Bhim Trailer : “పోరాడటానికి లా అనేది నాకు ఓ వెపన్ మాత్రమే”.. ఆకట్టుకుంటున్న ‘జై భీమ్’ ట్రైలర్..
ACB Raids: మాజీ సీఎం సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..
Aamir Khan: వివాదాస్పదంగా మారిన ఆమీర్ ఖాన్ యాడ్.. బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం.. కారణం అదేనా..?