ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకు సినిమాల్లో మంచి ఇంపార్టెన్స్ ఉండేది. కొందరు బాలనటులు సినిమాలకు చాలా వెయిట్ తెచ్చేవారు. అందుకు బేబీ షామిలీ వంటి వారిని ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ముద్దు ముద్దు మాటలు.. ముచ్చటైన యాక్టింగ్‌తో తెలుగు సినిమాల్లో మెప్పించిన చైల్డ్ ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. అలానే పెదరాయుడు మూవీలోని బుడ్డోడు మీకు గుర్తున్నాడా.. అప్పట్లో ఈ చిన్నోడు తన యాక్టింగ్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. అతను ఇప్పుడు ఎలా మేకోవర్ అయ్యాడో తెలిస్తే మీకు షాక్ తినాల్సిందే. అంతే కాదండోయ్.. మనోడు ఇప్పుడు పెద్ద హీరో కూడా. ఆహా మూవీతో వెండితెరకు పరిచమయమైన అతని పేరు మహేంద్రన్. 1994లో కోలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో పెదరాయుడు మూవీతో పరిచయమయ్యాడు. ‘నేను చూశాను తాతయ్య’ అంటూ… రజనీకాంత్ లాంటి అగ్ర హీరో కాంబినేషన్‌లో అంతమంది జనాల ముందు ఏ మాత్రం తడబడకుండా డైలాగ్ చెప్పి.. అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.
ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు మహేంద్రన్. దేవీ, లిటిల్ హార్ట్స్ సినిమాల్లో ప్రదర్శనకుగానూ .. ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని బాషలలో బాల నటుడుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 సినిమాలలో నటించాడు. పెరిగి పెద్దయ్యాక… తమిళంలో కథనాయకుడిగా చాలా సినిమాలు చేశాడు. అలాగే ఇతర హీరోల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నాడు చేస్తున్నాడు. మాస్టర్ సినిమాలో యంగ్ భవాని రోల్‌లో కనిపించింది మహేంద్రనే. గత ఏడాది రిప్అప్ బరీ అనే చిత్రంతో పలకరించాడు. అలాగే లేబుల్ అనే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా తన మార్క్ చూపించాడు. తెలుగులో బాలనటుడిగా అలరించిన ఇతడు.. ఇంకా టాలీవుడ్‌లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టలేదు. ఇప్పుడు తమిళంలో ఓ సినిమాను చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి