Lucifer Remake: మెగాస్టార్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్… మ్యూజికల్ వర్క్ స్టార్ట్ చేసిన తమన్… త్వరలోనే షూటింగ్..

|

Jun 28, 2021 | 8:39 PM

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు.

Lucifer Remake: మెగాస్టార్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... మ్యూజికల్ వర్క్ స్టార్ట్ చేసిన తమన్... త్వరలోనే షూటింగ్..
Lucifer
Follow us on

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అటు ఆచార్య సెట్స్ పై ఉండగానే.. చిరు తన 153వ సినిమా పనులు ప్రారంభించేసారు. ఆచార్య తర్వాత చిరు తన తదుపరి సినిమా డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేయబోతున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న తమన్… ఇప్పుడు మెగాస్టార్ మూవీకి మ్యూజిక్ అందించబోతుండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లూసీఫర్ మ్యూజిక్ సిట్టింగ్స్ తమన్.. డైరెక్టర్ మోహన్ రాజా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు మ్యూజిక్ గురించి చర్చించినట్లుగా సమాచారం. చిరు 153వ మూవీ మ్యూజికల్ సిట్టింగ్ పై వర్క్ జరుగుతుంది. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది అనే ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. మలయాళం లూసీఫర్ లో హీరోయిన్ ఉండదు.. మరి చిరుకు జోడిగా ఇందులో హీరోయిన్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్బీ చౌదరి. ఎన్వి ప్రసాద్ నిర్మించనున్నారు.

ట్వీట్..

Also Read: Vignesh Shivan: ప్రతి ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే..! నయన్ ఎక్కడుంటే.. అదే నా బెస్ట్ ప్లేస్: విఘ్నేశ్ శివన్

Ankita Lokhande: బిగ్‏బాస్‏లోకి అంకిత లోఖండే.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి..

MAA Elections 2021: ‘మా’ ఎన్నికల పోటీల్లో ట్విస్ట్.. రంగంలోకి హిందూ సంఘాలు… ప్రకాష్ రాజ్ పెత్తనం ఒప్పుకోం అంటూ…