Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం బరిలోకి దిగిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్…

|

Oct 05, 2021 | 11:17 AM

మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు మెగాస్టార్.

Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం బరిలోకి దిగిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్...
Thaman
Follow us on

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ మూవీని రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఫస్టు షెడ్యూల్‌‌‌ను ‘ఊటీ’లో ప్లాన్ చేశారు దర్శకుడు మోహన్ రాజా… కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. చిరంజీవితో పాటు మరికొందరు సీనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సందించనున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారిపోయాడు తమన్.. ఇటీవల కాలంలో తమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈక్రమంలో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగారు తమన్. ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాత దర్శకుడు మోహన్ రాజా .. తమన్ మ్యూజిక్ సిటింగ్స్‌ను మొదలుపెట్టారు. ఆ సమయంలో దిగిన ఫొటోను తమన్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇక తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు మోహన్ రాజా.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆలస్యమైనా అదరగొడతానంటున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్..

Manchi Rojulochaie: మంచి రోజు చూసుకొని వస్తున్న మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే.

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు