Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో.. ‘మాస్ కా బాప్’.. ఎవరో గుర్తుపట్టగలరా.?

|

Oct 25, 2022 | 3:30 PM

ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నోడు ఇప్పుడొక ఇండస్ట్రీకి స్టార్ హీరో..

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో.. మాస్ కా బాప్.. ఎవరో గుర్తుపట్టగలరా.?
Tollywood Actor
Follow us on

సినీ సెలిబ్రిటీల రేర్, చిన్ననాటి ఫోటోలపై వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ లుక్కేస్తుంటారు. ఇలా అవి కనిపిస్తే చాలు.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అయ్యేలా చేస్తారు. తాజాగా ఆ కోవలోనే ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నోడు ఇప్పుడొక ఇండస్ట్రీకి స్టార్ హీరో.. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. పోలికలు చూసి.. చెబుతున్న క్లూస్ బట్టి ఆయనెవరో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది.

ఇంకెవరో కాదు.. తమిళ స్టార్ హీరో విజయ్. ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు. సుమారు మూడు దశాబ్దాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూ.. రజనికాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోలలో ఒకరిగా నిలిచారు. 65 సినిమాల్లో లీడ్ యాక్టర్‌గా నటించిన విజయ్ తండ్రి మరెవరో కాదు తమిళ డైరెక్టర్ ఎస్.ఏ. చంద్రశేఖర్. ఇక ఆయన తల్లి ఓ ప్లేబాక్ సింగర్. ప్రస్తుతం విజయ్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు తన తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ అనే సినిమాలో నటిస్తున్నారు దళపతి విజయ్. ఈ మూవీ అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో సంక్రాంతికి విడుదల అవుతోంది.