AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOAT: వీకెండ్‌లో దుమ్మురేపిన దళపతి సినిమా.. నాలుగు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే

దళపతి విజయ్  సినిమా కావడంతో 'గోట్'పై జనాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వసూళ్ల విషయానికొస్తే.. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మూడు, నాలుగో రోజు వసూళ్లు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా.

GOAT: వీకెండ్‌లో దుమ్మురేపిన దళపతి సినిమా.. నాలుగు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
The Goat
Rajeev Rayala
|

Updated on: Sep 09, 2024 | 2:18 PM

Share

దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. దళపతి విజయ్  సినిమా కావడంతో ‘గోట్’పై జనాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వసూళ్ల విషయానికొస్తే.. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మూడు, నాలుగో రోజు వసూళ్లు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా.

‘ది గ్రేటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. అయితే దళపతి బ్లాక్‌బస్టర్ ‘లియో’ వసూళ్ల కంటే ‘గోట్’ ఇప్పటికీ వెనుకబడి ఉంది. ‘గోట్’ తొలిరోజు రూ.44 కోట్లు కలెక్ట్ చేసినా.. రెండో రోజు వసూళ్లు తగ్గిపోయాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు 43 శాతం తగ్గి రూ.24 కోట్లకు చేరాయి. కాగా వీకెండ్ చివరి రోజుల్లో కలెక్షన్లలో చాలా తేడా వచ్చింది. మూడో రోజు( శనివారం) 33 కోట్లు వసూలు చేసింది, అయితే నాలుగో రోజు ( ఆదివారం)’ది గ్రేటెస్ట్ ఆల్ టైం’ 34 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.. అలాగే గోట్ చిత్రం ఇప్పటివరకు రూ.137.2 కోట్లు రాబట్టింది. ‘ది గ్రేటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్’ నాలుగో రోజు తమిళంలో రూ.30 కోట్లు, హిందీలో రూ.2.7 కోట్లు, తెలుగులో రూ.1.5 కోట్లు వసూలు చేసింది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిన రూ. 221 కోట్లు రాబట్టింది. పెరుగుతున్న వసూళ్లు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా రూ.250 కోట్ల గ్రాస్‌ను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్ సమయంలోనూ తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది ‘గోట్’. ప్రీ బుకింగ్‌లో ‘గోట్’ రూ.50 కోట్లు రాబట్టింది.  రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ, ప్రశాంత్ అలాగే  ప్రభుదేవా కీలకపాత్రల్లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us