AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adarsha Kutumbam: దివాళి ఫ్లాన్స్ అన్నీ పేల్చేసిన ఆదర్శ కుటుంబం

Adarsha Kutumbam: దివాళి ఫ్లాన్స్ అన్నీ పేల్చేసిన ఆదర్శ కుటుంబం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 6:21 PM

Share

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్‌ 30న విడుదల కానుండటంతో దీపావళి బాక్సాఫీస్‌ లెక్కలు మారుతున్నాయి. నవంబర్‌ 5న ‘రామాయణ’ విడుదల కాగా, నవంబర్‌ 6న ‘ఇట్లు అర్జున’, ‘సమ్మర్‌ హాలీడేస్‌’, కిరణ్‌ అబ్బవరం ‘హతః’తో పాటు ఇతర చిత్రాలు రానున్నట్లు సమాచారం. కోలీవుడ్‌ సినిమాలు కూడా పోటీలో ఉండటంతో థియేటర్లు, స్క్రీన్ల కేటాయింపు డిస్ట్రిబ్యూటర్లకు సవాలుగా మారనుంది.

ఆదర్శ కుటుంబం ఎంట్రీతో బాక్సాఫీస్ దగ్గర దీపావళి లెక్కలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయా..? చిన్న సినిమాలన్నీ సైడ్ అయిపోయాయా..? ఒకపక్క ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా రామాయణ, మరోపక్క కోలీవుడ్ స్టార్స్, ఇంకోపక్క బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల రాకతో ఈ సారి థియేటర్ల కోసం అసలైన వార్ జరగబోతోందా..? ఒక్క సినిమాతో దివాళి రేస్ అంతా గజిబిజి గందరగోళంగా మారిందా..? అక్టోబర్ 30న వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం వస్తుండటంతో అప్పుడు రావాల్సిన సినిమాలన్నీ దివాళికి వాయిదా పడ్డాయి. కేవలం విశ్వక్ సేన్ కల్ట్ సినిమా మాత్రమే రేసులో ఉంది. మిగిలినవన్నీ నవంబర్ 6కి షిఫ్ట్ అయ్యాయి. ఇక ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన రామాయణ సినిమా నవంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణ రిలీజ్ అయిన మరుసటి రోజే అంటే నవంబర్ 6న ఇట్లు అర్జున, సమ్మర్ హాలీడేస్, కిరణ్ అబ్బవరం హత: సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. వీటి మేజర్ సినిమాలు అక్టోబర్ 30 నుంచి వాయిదా పడ్డవే. వీటికితోడు కోలీవుడ్ నుంచి సూర్య సీన్, నయనతార మహాశక్తి సినిమాలు కూడా అదే రోజు రానున్నారు. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తుండటంతో కన్ఫ్యూజన్ మొదలైపోయింది. దీపావళి వీకెండ్ నాటికి ఆదర్శ కుటుంబం సెకండ్ వీక్‌లో ఉండనుండగా, జైలర్ 2, రణబాలికి కూడా మంచి థియేటర్స్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ని భారీ సినిమాలు ఒకేసారి క్యూ కట్టడంతో స్క్రీన్ కౌంట్ అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్‌గా మారింది. మొత్తానికి ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఆడియన్స్ మనసులు గెలిచి ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Follow Us