తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Thalapathy Vijay)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా దళపతికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చారు విజయ్. తెలుగులోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా మంచి హిట్స్ అందుకోవడమే కాకుండా డీసెంట్ వసూళ్లను కూడా సొంతం చేసుకుంటున్నాయి. సినిమాలతో పాటు ఆ మధ్య దళపతి రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కడ ఊసు లేదు. ఇదిలా ఉంటే ఇటీవల హిందువులకు వ్యతిరేకంగా సినిమాలు చేస్తున్నారని.. విజయ్ సినిమాలను నిషేధించాలని మధురై ఆధీనం పిలుపునిచ్చింది. దాంతో వివాదం రాజుకుంది. తమ అభిమాన హీరో పై మధురై ఆధీనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తాజాగా మధురై ఆధీనం పీఠాధిపతి కి విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధీనం లోని వేల కోట్ల ఆస్తులు కాజేస్తున్న మీరు మా అభిమాన నటుడుని విమర్శించడం మంచిది కాదని.. మీ రాజకీయాలకు నటుడు విజయ్ ని టార్గెట్ చేయొద్దు, మాకు అన్ని మతాలు సమానమే..ఇక పై నటుడు విజయ్ పై విమర్శలు చేస్తే ఘాటుగా స్పందిస్తామని విజయ్ అభిమానులు హెచ్చరించారు. ఇక విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.