AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: కెప్టెన్ విజయ్‌కాంత్ ఇంటికి దళపతి విజయ్ ‘ది గోట్’ టీమ్.. ఎందుకో తెలుసా?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్.. ' ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటులు స్నేహ, ప్రశాంత్, ప్రభు దేవా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది

Thalapathy Vijay: కెప్టెన్ విజయ్‌కాంత్ ఇంటికి దళపతి విజయ్ ‘ది గోట్’ టీమ్.. ఎందుకో తెలుసా?
Thalapathy Vijay
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 10:57 AM

Share

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్.. ‘ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటులు స్నేహ, ప్రశాంత్, ప్రభు దేవా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది గోట్ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ది గోట్ చిత్ర బృందం తాజాగా దివంగత నటుడు విజయకాంత్‌ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత విజయ్ కాంత్ సతీమణి డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో కాసేపు మట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనికి కెప్టెన్ ఆశీర్వాదం తీసుకున్నాం అని క్యాప్షన్ జోడించారు.

కాగా ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాలో ఏఐ సాయంతో దివంగత నటుడు విజయకాంత్‌ను చూపించబోతున్నారు వెంకట్ ప్రభు. హీరో విజయ్, ఆయన తండ్రి ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ కు విజయ కాంత్‌ అంటే చాలా ఇష్టం. అలాగే విజయ కాంత్ అంటే కూడా హీరో విజయ్ కు చాలా గౌరవం. వీరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వెట్రి, సెంతూరపండి తదితర చిత్రాల్లో కలిసి నటించారు విజయ్, విజయ కాంత్. కాగా విజయకాంత్‌ మరణం తర్వాత తన రూపాన్ని సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు డైరెక్టర్‌ వెంకట్ ప్రభు. దీనిపై పలుమార్లు ప్రేమలతను విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అలా గోట్‌ సినిమాలో ఏఐ టెక్నాలజీ సాయంతో విజయకాంత్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత కెప్టెన్ అభిమానులు మళ్లీ విజయ కాంత్ ను వెండితెరపై చూడనున్నారన్నమాట.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ విజయ కాంత్ కు నివాళులు అర్పిస్తోన్న ది గోట్ చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్