మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. తాజాగా మంచు మనోజ్ ను మోహన్ బాబు యూనివర్సటీ సిబ్బంది అడ్డుకున్నారు. యూనివర్సిటీలోకి వెళ్లకుండా మంచు మనోజ్ ను అడ్డుకున్నారు సిబ్బంది. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నిచారు. అయితే మంచు మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాత, నానమ్మకు నివాళి అర్పించేందుకు వచ్చా.. గొడవ చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు అని మనోజ్ చెప్పినా కూడా వారు వినలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అందుకే మనోజ్ ను అనుమతించలేదని సిబ్బంది చెప్తున్నారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అంతకు ముందు మనోజ్ దంపతులు నారావారిపల్లి లో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు.
గతంలో మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. ఆ తర్వాత జల్‌పల్లిలోని మంచు టౌన్ కు వెళ్లారు మంచు మనోజ్ దంపతులు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు.
ఆతర్వాత మోహన్ బాబు మనోజ్ గురించి ఓ వాయిస్ నోట్ ను రిలీజ్ చేశారు. మనోజ్ తాగి పనివాళ్లను కోడుతున్నాడని, భార్యమాటలు విని మందుకు బానిసయ్యాడని, క్రమశిక్షణ తప్పాడని మోహన్ బాబు అన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని అర్ధమవుతుంది. దీని పై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి