Tanikella Bharani: ఆ సినిమాలో క్యారెక్టర్‌ని చూసి.. నన్ను చంపేస్తామని బెదిరించారు : తనికెళ్ళ భరణి

Tanikella Bharani: ప్రజలకు వినోదం అందించే మంచి సాధనం సినిమా.. ముఖ్యంగా తెలుగు వారికీ సినిమాకు విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ తమకు నచ్చిన నటీనటులను..

Tanikella Bharani: ఆ సినిమాలో క్యారెక్టర్‌ని చూసి.. నన్ను చంపేస్తామని బెదిరించారు : తనికెళ్ళ భరణి
Tanikella Bharani

Updated on: Jan 07, 2022 | 6:59 PM

Tanikella Bharani: ప్రజలకు వినోదం అందించే మంచి సాధనం సినిమా.. ముఖ్యంగా తెలుగు వారికీ సినిమాకు విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ తమకు నచ్చిన నటీనటులను అభిమానిస్తారు.. తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు.. కొన్ని సార్లు తమ అభిమాన నటీనటులు ధరించే దుస్తులను, స్టైల్ ను అనుకరిస్తారు.. అంతగా సినిమా తెలుగు జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ఒకొక్కసారి వెండి తెరపై విలన్ క్యారెక్టర్ లో నటించే నటీనటులను కొంతమంది ద్వేషిస్తారు.. తమ మధ్యకు అలాంటి వారు వస్తే.. ఆ క్యారెక్టర్ ను గుర్తు చేసుకుని కొట్టడానికి కూడా వెనుకాడరు.. ఇటువంటి అనుభవం గురించి ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణికి కూడా ఎదురైంది అట..

రంగస్థల నుంచి వెండి తెరపై సినిమా రచయితగా అడుగు పెట్టి.. అనంతరం నటుడిగా మారిన తనికెళ్ళ భరణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనికెళ్ళ భరణి శివ భక్తుడు.. తెలుగు భాషాభిమాని. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రల్లో నటించే తనికెళ్ళ భరణి.. ఇటీవల ఓ ఇంటర్యూలో తనకు ఎదురైనా ఓ అనుభవాన్ని గురించి చెప్పారు. తనను కొంత మంది మహిళలు తిట్టడం కాదు.. ఏకంగా చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పారు.

అప్పట్లోనే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా తెరకెక్కిన ఆమె సినిమాలో తనికెళ్ళ భరణి కూడా కీలక పాత్రలో నటించారు.  భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావగా తనికెళ్ళ భరణి నటించారు. ఆ సినిమాలో ఊహ ఉద్యోగం వస్తే డబ్బుల కోసం ఆశపడుతూ.. బలవంతంగా తాళి కడతాడు. ఆమె సినిమా రిలీజ్ అయిన తర్వాత తనికెళ్ళ భరణి నటనకు ఎంత మంచి పేరు వచ్చిందో.. బయట ఎక్కడ తనికెళ్ళ భరణిని చూసినా అక్కడ కొంతమంది మహిళలు కొట్టడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు.  ఇంకొంతమంది మహిళలు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చారు. అప్పుడు అది సినిమాలోని నా క్యారెక్టర్ నిజం కాదు అన్నా జనం వినిపించుకునేవారు కాదని.. సినిమా అంటే జనానికి అంత పిచ్చి అంటూ  చెప్పారు తనికెళ్ళ భరణి.

Also Read:

 కరోనా ఎఫెక్ట్ .. క్యాన్సిల్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్..

‘అది నిజమైతే నేనే మీకు స్వయంగా చెబుతా’.. రూమర్‌పై స్పందించిన తాప్సీ..