Telugu Indian Idol Season 3: సెన్సేషనల్ బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

 టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. 

Telugu Indian Idol Season 3: సెన్సేషనల్ బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..
Telugu Indian Idol Season 3

Updated on: Jul 03, 2024 | 10:35 AM

తెలుగు ఓటీటీ సెన్సేషన్ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు సరికొత్త గేమ్ షోలు, ఆకట్టుకుంటే టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే అద్భుతమైన సింగింగ్ కాంపిటేషన్ ను కూడా నిర్వహిస్తుంది ఆహా. టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెస్మరైజ్ చేసింది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి. చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. టాలెంటెడ్ కంపోజర్ థమన్, యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి వచ్చారు. వారిద్దరి పెర్ఫార్మెన్స్ ఎనర్జీని నింపింది.

థమన్, కార్తీక్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలైన “గేమ్ ఛేంజర్”, “పుష్ప 2″లో తమ వర్క్ గురించి చెప్పడం అందరినీ అలరించింది. థమన్ తన సూపర్ హిట్ “మగువా మగువా” పాట వెనుక స్ఫూర్తిని పంచుకోవడం హార్ట్ టచ్చింగ్ మూమెంట్. తన తల్లికి ట్రిబ్యుట్ గా ఈ పాట చేశాని చెప్పడం ఎమోషనల్ డెప్త్ జోడించింది.

మాస్ట్రో ఇళయరాజాకి శ్రీ కీర్తి యొక్క అద్భుత ప్రదర్శన యొక్క వీడియోను పంపాలని కార్తీక్ డిసైడ్ అవ్వడం మరో హైలెట్. యువ గాయని కీర్తన జడ్జ్ కార్తీక్‌కు మ్యూజిక్ లెసన్ ని చెప్పడం మరో ఆకర్షణగా నిలిచింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ట్యాలెంట్ ప్రజెంట్ చేసింది. మొత్తనికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా మస్ట్ వాచ్ షో గా నిలిచింది. అందరి ఫేవరేట్ తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.