Bigg Boss : బిగ్‏బాస్‏లోకి ఒకప్పటి తెలుగు హీరోయిన్స్.. ఇది కదా అసలైన ట్విస్ట్..

|

Sep 19, 2024 | 11:34 AM

అయితే ఈసారి కంటెస్టెంట్స్, వారి పారితోషికాల విషయాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు నిర్వాహకులు. ఈసారి బిగ్‏బాస్ హౌస్ లోకి పాపులారిటీ ఉన్న హీరోహీరోయిన్లను, ఇతర సెలబ్రెటీలను తీసుకురావాలని చూస్తున్నారట. ఇప్పుడు బిగ్‏బాస్ హిందీ సీజన్ 18లోకి ఒకప్పటి తెలుగు హీరోయిన్లను సెలక్ట్ చేశారట. వారిద్దరు అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో చక్రం తిప్పారు.

Bigg Boss : బిగ్‏బాస్‏లోకి ఒకప్పటి తెలుగు హీరోయిన్స్.. ఇది కదా అసలైన ట్విస్ట్..
Bigg Boss
Follow us on

బుల్లితెరపై బిగ్‏బాస్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగులో ప్రారంభమైన 8 సీజన్.. రసవత్తరంగా సాగుతుంది. ఇక అటు తమిళం, హిందీలోనూ బిగ్‏బాస్ సీజన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ షో మొదలుకానుంది. ఇటీవలే బిగ్‏బాస్ సీజన్ 18ను అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అక్టోబర్ మొదటి వారంలో హిందీ బిగ్‏బాస్ స్టార్ట్ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి కంటెస్టెంట్స్, వారి పారితోషికాల విషయాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు నిర్వాహకులు. ఈసారి బిగ్‏బాస్ హౌస్ లోకి పాపులారిటీ ఉన్న హీరోహీరోయిన్లను, ఇతర సెలబ్రెటీలను తీసుకురావాలని చూస్తున్నారట. ఇప్పుడు బిగ్‏బాస్ హిందీ సీజన్ 18లోకి ఒకప్పటి తెలుగు హీరోయిన్లను సెలక్ట్ చేశారట. వారిద్దరు అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో చక్రం తిప్పారు.

మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈసారి బిగ్‏బాస్ సీజన్ 18లో తెలుగు హీరోయిన్స్ అనిత, సమీరా రెడ్డిలను ఎంపిక చేశారని తెలుస్తోంది. వీరిద్దరు ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓవైపు అనిత వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉండగా.. నెట్టింట నిత్యం ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది సమీరా రెడ్డి. త్వరలోనే కొన్ని సినిమాల్లోనూ కనిపించనుందట సమీరా. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అనిత. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో సీరియల్స్ చేస్తుంది.

ఇక సమీరా రెడ్డి.. నరసింహుడు, జై చిరంజీవి, అశోక్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళంలో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సమీరా రెడ్డి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు వీరిద్దరు బిగ్‏బాస్ సీజన్ 18లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.