తొలుత బాగా ప్రాచుర్యం పొందిన నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ పై వీక్షకులు పెదవిరిచారు. కానీ ఎపిసోడ్స్ గడిచేకొద్ది ఈ రియాల్టి షో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అదిరిపోయే టాస్కులు, మెరిసే నటీమణుల అందాలు, చిన్న చిన్న గొడవలు, ఆసక్తి రేపే రిలేషన్స్, నామినేషన్‌లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ షోకు రోజురోజుకు వీక్షకులు పెరుగుతున్నారు. కాగా బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ ఓ ఎపిసోడ్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. అలాగే ఈ సీజన్‌లో కూడా శుక్రవారం బిగ్‌బాస్ హౌస్ లో ష్యాషన్ షో జరిగింది. అబ్బాయిలు, అమ్మాయిలు అందమైన డ్రస్సులతో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. ముఖ్యంగా సాంప్రదాయ చీరకట్టులో అమ్మాయిలందరూ సెగలు రేపారు. పనిలో పనిగా డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విన్నర్ గా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అమ్మాయిలంతా కలిసి అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా ప్రకటించారు. అతడు కూడా రూ. లక్ష అందుకున్నాడు.
అద్దంలా మారిన అవినాష్ :
అమ్మాయిలంతా అవినాష్ ను విజేతగా ప్రకటించడంతో బిగ్ బాస్ అమ్మాయిలకు అద్దంలా మారాలని టాస్క్ ఇచ్చాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకుంటుంటే అవినాష్ చేసిన కామెడీ అంతా, ఇంతా కాదు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ సరదాగా అటపట్టించాడు.
Also Read :