Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..

Esha Rebba: తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం.. ఇక కొద్ది మంది మాత్రమే హీరోయిన్స్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..
Eesha Rebba

Updated on: Jun 12, 2021 | 10:22 AM

Esha Rebba: తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం.. ఇక కొద్ది మంది మాత్రమే హీరోయిన్స్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులోనే తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఒకరు. అతి తక్కువ కాలంలోనే ఈషా రెబ్బా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా.. మలయాళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అప్ కమింగ్ తమిళ్- మలయాళం బైలింగ్వేల్ మూవీతో ఈషా రెబ్బా మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. డైరెక్టర్ ఫెల్లిని రూపొందిస్తున్న ఈ సినిమాకు ఒట్టు అనే టైటిల్ ను ఖరారు చేసారు చిత్రయూనిట్. ఇందులో అరవింద్ స్వామి కూడా 25 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ మూవీలో కుంచాకో బోబన్ హీరో కాగా.. హీరోయిన్ గా ఈషారెబ్బా చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా మాట్లాడుతూ.. డైరెక్టర్ ఫెల్లిని ఇటీవల రిలీజైన ఒక సినిమాలో నన్ను చూశాడట.. అయితే ఆ వెంటనే నేను తన సినిమాలో పాత్రకు సరిపోతాను అనిపించి నన్ను సంప్రదించారు. అయితే నాకు సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే చాలా నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను.” అని చెప్పింది. “ఈ మూవీలోని క్యారెక్టర్ నాకు కూడా కొత్తగానే ఉంది. ఇందుకోసం నేను చాలా మేకోవర్ కావాల్సి ఉంటుంది. తెలుగు వాళ్లు కూడా నన్ను కొత్త అవతారంలో చూడబోతున్నారు. ఈ సినిమా ఇద్దరు స్నేహితులు మధ్య అనుబంధం నేపథ్యంలో ఉండబోతుంది” అంటూ స్టోరీ పై హింట్ ఇచ్చింది ఈషా. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ గోవాలో జరుగబోతుంది. అందులో ఈషా పాల్గోననుంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఈషా మలయాళం కూడా నేర్చుకోవడానికి ఓ ట్యూటర్ను నియమించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా చెప్పింది. అలాగే.. తను యాక్టర్ అరవింద్ స్వామికి పెద్ద అభిమానిని అని చెప్పుకోచ్చింది.

Also Read:  Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ వెనకే ఆ ముగ్గురు టాలీవుడ్ నిర్మాతలు.. ఎవరికి ఓటేస్తుందో మరి.?

Sanusha Santhosh: బాడీషేమింగ్ చేసిన నెటిజన్స్.. మీరెంత పర్‏ఫెక్ట్‏గా ఉన్నారో ఆలోచించుకోండి.. స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us