Mohan Babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం

|

Dec 19, 2024 | 4:39 PM

టీవీ9 న్యాయపోరాటానికి నటుడు మోహన్‌బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురైంది.

Mohan Babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం
Mohan Babu
Follow us on

హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా..ఆదేశాలు ఇవ్వాలని మోహన్‌బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్‌ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. టీవీ9 రిపోర్ట్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన గన్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

మోహన్ బాబు పై హత్యాయత్నం  కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్, మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో టీవీ 9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబు ఆతర్వాత టీవీ9కు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. రెండు రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్ళలేదు అని వీడియో వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.