Guntur Kaaram: ‘గుంటూరు కారం’ టికెట్ ధరలు పెంచుకోవచ్చు.. బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గుంటూరు కారం బెన్ ఫిట్ షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 12న అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలో 23 చోట్ల బెన్ ఫిట్ షోలు వేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాను ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవో జారిచేసింది.

Guntur Kaaram: గుంటూరు కారం టికెట్ ధరలు పెంచుకోవచ్చు.. బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Guntur Kaaram

Updated on: Jan 09, 2024 | 4:17 PM

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’ చిత్రయూనిట్‏కు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గుంటూరు కారం బెన్ ఫిట్ షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 12న అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలో 23 చోట్ల బెన్ ఫిట్ షోలు వేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాను ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవో జారిచేసింది. అయితే బెనిఫిట్ షోస్ కేవలం మొదటివారానికి మాత్రమే వర్తిస్తాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రమణగాడి మాస్ జాతర షూరు అంటూ రిలీజ్ అయిన ట్రైలర్‏ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

Guntur Kaaram

ఈ చిత్రాన్ని హాసిని, హారిక క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో మహేష్.. చాలా కాలం తర్వాత మాస్ హీరోగా కనిపించనున్నారు. మునుపెన్నడు చూడని పాత్రలో సూపర్ స్టార్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీంతో గుంటూరు కారం సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈవెంట్ వాయిదా వేసింది చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.