Sea Backdrop Films: ఎగిసిపడే కెరటాలు మధ్య తెలుగు సినిమాలు.. ట్రెండింగ్‌లో సీ బ్యాక్‌డ్రాప్ కథలు..
తెలుగు సినిమా కథల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి.. దర్శకుల మనసులో ఊహలు ఉప్పెనలా ఉప్పొంగుతున్నాయి.. సముద్రం రా రమ్మని పిలుస్తుంది.. అందుకే పెన్ పట్టుకుని అలల నేపథ్యంలోనే కథలను అల్లేస్తున్నారు.. ఈ మధ్య టాలీవుడ్‌లో సీ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరిగింది. ఈ తరహా కథలకు ఉన్నపలంగా క్రేజ్ రావడానికి కారణమేంటి..?
Updated on: Jan 09, 2024 | 3:20 PM

తెలుగు సినిమా కథల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి.. దర్శకుల మనసులో ఊహలు ఉప్పెనలా ఉప్పొంగుతున్నాయి.. సముద్రం రా రమ్మని పిలుస్తుంది.. అందుకే పెన్ పట్టుకుని అలల నేపథ్యంలోనే కథలను అల్లేస్తున్నారు.. ఈ మధ్య టాలీవుడ్‌లో సీ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరిగింది. ఈ తరహా కథలకు ఉన్నపలంగా క్రేజ్ రావడానికి కారణమేంటి..?

టాలీవుడ్‌తో సముద్రం మాట్లాడుతుందిప్పుడు.. మన దర్శకులు కూడా ఆ అలలతోనే ప్రేమలో పడిపోయారు. మరీ ముఖ్యంగా ఉప్పెన నుంచి సీ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది.

అందులో హీరో జాలరి.. గతేడాది మెగాస్టార్ సైతం వాల్తేరు వీరయ్యలో జాలరిగానే కనిపించారు. దానికే మాఫియాను కలిపి రొటీన్ కథతోనే 230 కోట్లు వసూలు చేసాడు వాల్తేరు వీరయ్య.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సైతం పూర్తిగా సముద్రం నేపథ్యంలోనే వస్తుంది. ఈ సినిమా కోసం గ్రాఫిక్స్‌లో ఓ సముద్రాన్ని సృష్టిస్తున్నారు విఎఫ్ఎక్స్ టీం. దీని కథ మొత్తం సీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. కోస్టల్ ల్యాండ్స్‌లోనే కథ అంతా ఉంటుందని కొరటాల ఇప్పటికే చెప్పారు కూడా. హాలీవుడ్ టెక్నీషియన్స్ దేవర కోసం పని చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లోనూ తారక్ సముద్రం మధ్యలో ఓడలో కనిపిస్తున్నారు.

నాగ చైతన్య తండేల్ సైతం సముద్రం బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తుంది. గుజరాత్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చందూ మొండేటి ఈ కథ రాసుకున్నారు. ఇందులో చైతూ బోట్ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. హైలీ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ప్యాక్ట్ లవ్ స్టోరీగా ఇది వస్తుంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్. గతంలో చైతూ, చందూ కాంబినేషన్‌లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలొచ్చాయి.