Folk Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ పల్లె ఫోక్ సాంగ్.. అసలు మైండ్‌లోంచి వెళ్ల‌ట్లేదుగా

బొంబాయికి రాను, దారి పొంటొత్తుండు, పేరుగ‌ళ్ల పెద్దిరెడ్డి, బాయిలోన బల్లిపలికే అంటూ ఇటీవల వచ్చిన తెలంగాణ పల్లె పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఇదే తెలంగాణ పల్లె కు చెందిన మ‌రో పాట యూ ట్యూబ్‌లో సెన్షేష‌న్ సృష్టిస్తోంది.

Folk Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలంగాణ పల్లె ఫోక్ సాంగ్.. అసలు మైండ్‌లోంచి వెళ్ల‌ట్లేదుగా
Polamuru Polamulo Natu Vese Bava Song

Updated on: Jan 22, 2026 | 7:54 PM

ప్రస్తుతం సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కు కూడా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పల్లె జానపదాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి జాన‌ప‌ద పాటలు విడుద‌ల‌వుతూ సంగీతాభిమానులను ఓ రేంజ్‌లో అల‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే రాను నేను బొంబాయికి రాను, దారి పొంటొత్తుండు, పేరుగ‌ళ్ల పెద్దిరెడ్డి, బాయిలోన బల్లిపలికే వంటి తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెళ్లి వేడుకలు జరిగినా స్కూల్ ఫంక్షన్లు నిర్వహించినా.. ఇంకా ఏ శుభకార్యం జరిగినా మన తెలంగాణ జానపద పాటలు వినిపించాల్సిందే. డ్యాన్సుల మోతలు మోగాల్సిందే. అలా ఇప్పుడ మరో కొత్త జానపద పాట సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది. ‘పొలుమారు పొలములో నాటు వేసే బావ’ అంటూ బావా మరదళ్లు పచ్చన పొలాల్లో పాడుకున్న ఈ పాటకు ఇప్పుడు యూట్యూబ్ రికార్డు వ్యూస్ వస్తున్నాయి. పాట విన్న నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏం సాంగ్ రా బాబు.. అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘పొలుమారు పొలములో నాటు వేసే బావ’ పాటలో య‌మున తార , రోహిత్ జాక్స‌న్ బావా మరదళ్లుగా న‌టించారు. ఈ ఫోక్ సాంగ్ కు స్వయంగా సాహిత్యం అందించి దర్శకత్వంవహించారు శేఖర్ ఇచ్చోడ. అలాగే జోగుల వెంక‌టేశ్ , మ‌మ‌త ర‌మేశ్ ఈ పాటను ఎంతో లయబద్ధంగా ఆల‌పించారు. ఇక ఈ సాంగ్ కు మ‌ను మైఖెల్ అందించిన నృత్య రీతులు హైలెల్ గా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండే ఈ సాంగ్ లో లొకేషన్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. అల్ల‌రి అబ్బాయి.. చిలిపి అమ్మాయి పొలం ప‌నులు చేసుకుంటూ ఒక‌రినొక‌రు టీజ్ చేసుకుంటూ పాడుకునే ఈ పాట ఒక్క‌ సారి వింటే చాలు నాలుగైదు మార్లు రిపీట్ చేయ‌క మాన‌రు. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్ పై మీరూ ఒక లుక్ వేయండి.

‘పొలుమారు పొలములో నాటు వేసే బావ’ ఫుల్ సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.