
మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న అనుష్క ఘాటి సినిమాకు బిగ్ షాక్ తగిలింది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఈగల్ టీం అభ్యంతరం తెలిపింది. గంజాయి పెంపకం పై ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలకు డిస్ క్లైమర్ ఇవ్వకుంటే NDPS యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని ఈగల్ టీం ఘాటి చిత్ర బృందాన్నిహెచ్చరించింది. ఈ సందర్భంగా గురువారం ( సెప్టెంబర్ 04) ఘాటి సినిమా ట్రైలర్‌లో డ్రగ్స్ సన్నివేశాలపై ఈగల్ టీం ఒక ప్రకటనను విడదల చేసింది. ఈ సినిమాలో గంజాయి సాగు, రవాణా,వినియోగం చుట్టూ కేంద్రీకృతమైన ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సినిమా ట్రైలర్‌లో డ్రగ్స్ ను హెచ్చరించే చట్టబద్ధమైన హెచ్చరికలు కూడా లేవని తెలిసింది. హెచ్చరికలు లేకపోవడంతో యువత, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు ఏ రూపంలో ప్రోత్సహించినా సహించేది లేదని, ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, 1985 NDPS చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఘాటి చిత్ర బృందాన్ని హెచ్చరించారు.
కాగా చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సినిమా ఘాటి. వేదం లాంటి సూపర్ హిట్ తర్వాత అనుష్కా శెట్టి- క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఘాటి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 05) ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఇంతలోనే తెలంగాణ ఈగల్ టీమ్ ఘాటి చిత్ర యూనిట్ కు ఊహించని షాక్ ఇచ్చింది. మరి దీనిపై ఘాటి దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Divine blessings before the big day ✨@DirKrish & @iamVikramPrabhu took a visit to Khairatabad Ganesh ahead of the grand release of #Ghaati tomorrow.
🎟️Book your tickets Now:https://t.co/7YRlKANrO8 | https://t.co/WsTVa24Ccn
⭐ing ‘The Queen’ @MsAnushkaShetty &… pic.twitter.com/E3UTG6tnIp
— UV Creations (@UV_Creations) September 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.