సీతమ్మ వాకిల్తో సిరిమల్లె చెట్టు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ(Tejaswi Madivada). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అలాగే హీరోయిన్ గాను నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాటిస్పేట్ చేసింది తేజస్వి. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తుంది తేజస్వి.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయలు పంచుకుంది.
తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. కథ డిమాండ్ చేస్తే ఎలాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికైనా సిద్ధం అంటుంది.అలాగే కిస్ సీన్స్ లో నటించేంచడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చింది. అలాగే కమిట్మెంట్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదట.. అయితే ఈ సినిమాలో నటించిన శ్రీనాథ్ మాత్రం ఇబ్బంది పడ్డాడని తెలిపింది. ఇక నిజజీవితంలో తనను ఎవ్వరూ కమిట్మెంట్ అడగలేదని ఒకవేళ అడగాలన్నా భయపడ్తారని చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో వాళ్ళు సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని అంటున్నారు.. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు అని తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.