AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teja Sajja: హనుమాన్ హీరో కొత్త ప్రాజెక్ట్.. తేజా సజ్జా ‘మిరాయ్’ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..

తాజాగా తేజ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈసారి మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు తేజా సజ్జా కొత్త సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్

Teja Sajja: హనుమాన్ హీరో కొత్త ప్రాజెక్ట్.. తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..
Mirai Movie
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2024 | 2:16 PM

Share

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ మూవీతో ఇటు సౌత్.. అటు నార్త్ అడియన్స్‏ను మెప్పించాడు. ఇక ప్రస్తుతం హనుమాన్ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జై హనుమాన్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీ్ట్ కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా తేజ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈసారి మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు తేజా సజ్జా కొత్త సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ టైటిల్ రివీల్ కార్యక్రమం జరిగింది.

తేజ సజ్జా నటిస్తున్న ఈ కొత్త సినిమాకు మిరాయి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో తేజ సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు టైటిల్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీతోపాటు చైనీస్ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

“సామ్రాట్ అశోక్..చరిత్రలో మరకగా మిగిలిన అతడి కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపం నుంచి వెలుగు చూసిన ఓ దేవ రహస్యం.. అదే మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం.. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామకం.. అలాంటి జ్ఞానానికి చేరువ అవుతోన్న ఓ గ్రహణం.. ఆ గ్రహణాన్ని కాపాడే ఓ జననం..ఇది తరాలుగా తగ్గని మహారణం” అంటూ బుద్దిస్ మాంక్ చెపిన డైలాగ్ తో తేజ సజ్జా ఎంట్రీ మరింత హైలెట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే.. యుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ తో మరోసారి హిస్టారికల్ మూవీతో సూపర్ హిట్ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.