Taraka Ratna: తారకరత్న పెద్ద కర్మ.. నివాళి అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. అలేఖ్యను ఓదార్చిన చంద్రబాబు

నందమూరి తారకరత్న పెద్ద కర్మ ఇవాళ (మార్చి 2) హైదరాబాద్‌ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Taraka Ratna: తారకరత్న పెద్ద కర్మ.. నివాళి అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. అలేఖ్యను ఓదార్చిన చంద్రబాబు
Taraka Ratna Pedda Karma

Updated on: Mar 02, 2023 | 3:32 PM

నందమూరి తారకరత్న పెద్ద కర్మ ఇవాళ (మార్చి 2) హైదరాబాద్‌ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇక టాలీవుడ్‌ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరై తారకరత్నకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తారకరత్న సతీమణి అలేఖ్యను ఓదార్చారు. అలాగే కూతురుతో కాసేపు సరదాగా మాట్లాడారు. నందమూరి తారకరత్న గత నెల ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌ కుప్పం పాదయాత్రలో గుండెపోటుతో కుప్ప కూలిన ఆయన సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. విదేశాల నుంచి వైద్యులను రప్పించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు శివరాత్రి రోజున శివైక్యం చెందారు. తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

కాగా రాజకీయాలను పక్కనపెట్టి మరీ తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం ఏర్పాట్లు చూసుకున్నారు నందమూరి బాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజా కార్యక్రమంలోనూ చంద్రబాబు, విజయసాయిరెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసమే ఎన్టీఆర్ తన సినిమా పూజా కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్ననాడు. అలాగే ఆస్కార్‌ అవార్డుల కోసంఅమెరికా వెళ్లకుండా ఆగాడు.

Chandrababu Naidu

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..