కాగా ‘మా’ కు ఈసీ మెంబర్‌గా రాజీనామా చేసిన అనంతరం తనీష్ స్పందించారు. ఓట్లు వేసి గెలిపించిన వారికి థ్యాంక్స్ చెప్పిన తనీష్.. తాజాగా రాజీనామా చేయడంతో వారందరికీ సారీ చెప్పారు. తన వెనుక నిలబడినవారందర్నీ తనీష్ గుర్తు చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ ఐడియాలజీ నచ్చి.. అతని ప్యానల్ నుంచి కంటెస్ట్ చేసినట్టు తనీష్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మోహన్ బాబు బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారని.. తనను సేవ్ చేసేందుకు వచ్చిన బెనర్జీని కూడా దారుణంగా తిట్టినట్లు తెలిపారు. తనకు బాదేసిందని.. ఏడ్చానని.. తర్వాత మంచు విష్ణు, మనోజ్ వచ్చి సముదాయించారని తనీష్ చెప్పాడు. తన వల్లే ఇదంతా జరిగిందని బెనర్జీకి సారీ చెప్పాడు తనీష్. తనకు అమ్మే సర్వస్వం అని.. ఆయన మాటలు మర్చిపోదామనుకున్నా అమ్మను అంటే తీసుకోలేం కదా అని తనీష్ అన్నారు. దెబ్బ మానిపోయినా.. ఆ గాయం గుర్తు అలాగే ఉంటుందని అన్నారు. ఈసీ మెంబర్‌గా భయపడి కంటిన్యూ అవ్వడం కంటే.. రిజైన్ చేయడమే కరెక్ట్ అనిపించింది అన్నారు. సోదరుడిగా మంచు విష్ణుని గౌరవిస్తానని తెలిపారు.
Also Read: సంచలనం… నిట్టనిలువునా చీలిన ‘మా’.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా
సుడిగాలి సుధీర్‌కు, సంపూకు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ