Hero Suriya: బాలీవుడ్‌లోకి స్టార్ హీరో సూర్య.. ఎవరో దర్శకత్వంలోనంటే..

సూర్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. కానీ సూర్య నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయ్. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సూర్య.  సమాజానికి దీటుగా, దురాచారాలను ఎత్తిచూపే ‘సురారై పోట్రు’, ‘జై భీమ్‌’ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో చివరిలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడని తెలుస్తోంది.

Hero Suriya: బాలీవుడ్‌లోకి స్టార్ హీరో సూర్య.. ఎవరో దర్శకత్వంలోనంటే..
Surya

Updated on: Sep 17, 2023 | 8:27 AM

తమిళ స్టార్ నటుడు సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి   విజయ్‌, అజిత్‌, విశాల్‌ లాంటి హీరోలు సక్సెస్ ఫుల్ సినిమాలతో అదరగొడుతున్నారు. కానీ సూర్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. కానీ సూర్య నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయ్. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సూర్య.  సమాజానికి దీటుగా, దురాచారాలను ఎత్తిచూపే ‘సురారై పోట్రు’, ‘జై భీమ్‌’ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో చివరిలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడని తమిళ్ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.

సీనియర్ బాలీవుడ్ దర్శకుడు సూర్యని తన తదుపరి సినిమా కోసం సంప్రదించారని తెలుస్తోంది. ఇప్పటికే కథను కూడా వినిపించడంతో పాటు సూర్య కూడా అంగీకరించాడని అంటున్నారు. ‘ఆస్క్’, ‘రంగ్ దే బసంతి’, ‘ఢిల్లీ 6’ వంటి హిందీ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నాడని తెలుస్తోంది.

రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న నయా మూవీ ‘కర్ణ’. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇటీవల సూర్య ఓం ప్రకాష్ మెహతా ఆఫీసులో కనిపించాడు. ఓం ప్రకాష్ , సూర్య ఇద్దరూ మీడియా కంటపడటంతో పాటు ఫోటోలు కూడా దిగారు.దాంతో ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్నారని ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య తమిళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కంగువ’ చిత్రంలో సూర్య నటిస్తున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేయనున్నాడు. ‘సురారై పోట్రు’ తర్వాత వీరికిది రెండో సినిమా. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విక్రమ్ 2’ సినిమాలో సూర్య విలన్‌గా నటించనున్నాడు. వీటితో పాటుగానే  వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వడివాసల్’ సినిమా కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇన్ని సినిమాల మధ్య ఓం ప్రకాష్ మెహ్రాతో ‘కర్ణ’ సినిమా ఎప్పుడు చేస్తాడు..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ధనుష్ బాలీవుడ్ లో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. మరి సూర్య కూడా ధనుష్ ;లా బాలీవుడ్ లోనూ సక్సెస్ అవుతారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.