Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్.. ఆ పార్టీ సపోర్టుతోనే ఎగువ సభలోకి..
స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, శింబు, త్రిష కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కమల్ రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు.

సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, 2025న జరగనున్న నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం పి. విల్సన్, ఎస్.ఆర్. శివలింగం, కవిన్నా సల్మాల పేర్లను రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతోపాటు మక్కల్ నీది మయ్యం తరపున కమల్ హాసన్ పేరును తీర్మానం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభకు కమల్ హాసన్ ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం తెలిపింది. తమిళనాడులోని అధికార డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తామని ఆధికారిక పార్టీ డీఎంకే వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి.
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు.. “ఇక్కడ నాకు కుటంబం ఉంది.. అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది” అని అన్నారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించారని.. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో శింబు, శివరాజ్ కుమార్, త్రిష కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tamil Nadu | Salma, Advocate P Wilson and SR Sivalingam have been announced as DMK candidates for Rajya Sabha.
One seat has been allocated to Makkal Needhi Maiam as per the earlier agreement. pic.twitter.com/BLw8g1j3Pg
— ANI (@ANI) May 28, 2025
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
